Tata Altroz CNG | దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ సోమవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆరు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. దీని ధర రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షల మధ్య పలుకుతుంది. ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ పేరుతో మార్కెట్లోకి వచ్చింది.సీఎన్జీ ట్యాంకుల కోసం డ్యుయల్ -సిలిండర్ సెటప్ ఏర్పాటు చేశారు.
కొత్త టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షన్ కారులో అత్యాధునిక ఫీచర్లు జత చేశారు. ఎక్స్ఎం+ (ఎస్), ఎక్స్ జడ్ + (ఎస్), ఎక్స్ జడ్ + (ఎస్) ట్రిమ్ వేరియంట్లలో కొత్తగా వాయిస్ అసిస్టెంట్‌తో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఓపెన్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫయ్యర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్-16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 8 -స్పీకర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
లగేజీ ఏరియాకు దిగువన ట్విన్ సీఎన్జీ సిలిండర్లు ఏర్పాటు చేశారు. ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు 210 -లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. 7.0-అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ కారు 1.2 -లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తున్నది. సీఎన్జీ మోడ్‌లో 77 హెచ్‌పీ విద్యుత్, 103 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ, టయోటా గ్లాంజా సీఎన్జీ కార్లకు టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ పోటీ ఇవ్వనున్నది. మారుతి బాలెనో సీఎన్జీ వేరియంట్ కారు రూ.8.35 లక్షల నుంచి రూ.9.28 లక్షల మధ్య పలుకుతుంది. టయోటా గ్లాంజా సీఎన్జీ కారు ధర రూ.8.50 లక్షలు – రూ.9.53 లక్షల మధ్య లభిస్తుంది. మారుతి బాలెనో కంటే టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ రూ.80 వేలు, టయోటా గ్లాంజా సీఎన్జీ కంటే రూ.95 వేలు తక్కువ. అయితే టాప్ హై ఎండ్ ఆల్ట్రోజ్ సీఎన్జీ ఎక్స్ జడ్ + ఓ (ఎస్) వేరియంట్ కారు ధర బాలెనో సీఎన్జీ కంటే రూ.1.27 లక్షలు, గ్లాంజా సీఎన్జీ కంటే రూ.1.2 లక్షలు ఎక్కువ.
వేరియంట్ ———– ధర (రూ.ల్లో)
ఎక్స్ఈ —————- 7.55 లక్షలు
ఎక్స్ఎం+ ————- 8.40 లక్షలు
ఎక్స్ఎం+ (ఎస్) —— 8.85 లక్షలు
ఎక్స్ జడ్ ————– 9.53 లక్షలు
ఎక్స్ జడ్+ (ఎస్) —– 10.03 లక్షలు
ఎక్స్ జడ్+ ఓ (ఎస్) — 10.55 లక్షలు