IT | ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మన ప్రతీ లావాదేవీపైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలపైనా ఐటీ నోటీసులు వస్తాయా? అన్న సందేహం రాకమానదు. అసలు ఎలాంటప్పుడు ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి మనకు నోటీసులు వస్తాయి. వేటికి మినహాయింపు ఉంటుంది.
ఒక్కసారి పరిశీలిస్తే.. ఇదీ సంగతి..
ఆదాయ పన్ను నిపుణుల వివరాల ప్రకారం.. భర్త నుంచి భార్యకు ప్రతినెలా గృహావసరాల కోసం నగదు ఇస్తే అందుకు ఐటీ నోటీసులు రావు. ఎందుకంటే ఈ నగదు.. భర్త ఆదాయం పరిధిలోకే వెళ్తుంది. అయితే ఈ మొత్తాలను భార్య ఎక్కడో ఓ చోట పెట్టుబడిగా పెడుతూ దానిపై ఆదాయం పొందితే మాత్రం ఐటీ తాఖీదులు తప్పవు. ఐటీ చట్టంలోని సెక్షన్ 269ఎస్ఎస్, 269టీ కింద రూ.20,000కు మించి ఉన్న నగదు లావాదేవీలపై జరిమానాలూ పడవచ్చు. అయినప్పటికీ చాలా కేసుల్లో మినహాయింపు లభించింది. ఇక తండ్రీ-కొడుకులు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య నడిచే లావాదేవీలూ ఇదే కోవకు వస్తాయి.
ఐటీ నోటీసులను వివిధ కారణాలతో సంబంధిత అధికారులు జారీ చేస్తారు. వాటిలో..