చెన్నై, మార్చి 29: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్..దేశవ్యాప్త విస్తరణలో భాగంగా ఒకేసారి ఆరు శాఖలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యతోపాటు తెలంగాణలోని కరీంనగర్లో, తమిళనాడులో నాలుగు శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒకేరోజు కొత్తగా ఆరు శాఖలను ప్రారంభించినట్లు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ నాయర్ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంక్ 578 శాఖలను కలిగివుంది.