Tomato Tales | ఉల్లిగడ్డలు.. టమోటాలు. ప్రతిరోజూ వంటింట్లో వాడే కూరగాయలు.. వర్షాభావం వల్ల గానీ, అధిక వర్షాల వల్ల గానీ ఈ పంటల దిగుబడి తగ్గి, ధరలు పెరిగేవి.. ఈసారి టమోటా తోటలు దెబ్బ తిన్నాయి. దీంతో టమోటాల ధరలు ఆకాశాన్నంటే రీతిలో .. గత నెల రోజుల్లో 326.13 శాతం టమోటా ధరలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కర్ణాటకకు చెందిన రైతులు తమ 2000 బాక్స్‌ల టమోటాలు విక్రయించడంతో రూ.38 లక్షల ఆదాయం వచ్చింది.
కోలార్ జిల్లాలోని బెథమంగళ గ్రామంలోని ప్రభాకర్ గుప్తా, ఆయన సోదరులు రైతులు.. 40 ఏండ్లకు పైగా తమ 40 ఎకరాల భూమిలో టమోటా తదితర పంటలు సాగు చేస్తున్నారు. రెండేండ్ల క్రితం 15 కిలోల టమోటా బాక్స్ ధర రూ.800 పలికితే, మంగళవారం రూ.1900 పలికింది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల గురించి తమకు బాగా తెలుసునని, పెస్ట్ల సాయంతో నాణ్యమైన టమోటాలు పండిస్తున్నామని తెలిపారు ప్రభాకర్ గుప్తా బంధువు సురేశ్.
చింతమణి తాలూకాలోని వైజ్యాకూర్ గ్రామ రైతు వెంకట్రామిరెడ్డి.. తాను మంగళవారం మార్కెట్‌కు తీసుకెళ్లిన 15 కిలోల టమోటాల బాక్స్ రూ.2,200 పలికిందని తెలిపారు. మండీకి 54 బాక్సుల టమోటాలు తరలించగా, వాటిల్లో 36 బాక్సులకు రూ.2,200, మిగతా 18 బాక్సులు రూ.900 పలికింది. మొత్తం కలిపి రూ.3.3 లక్షల ఆదాయం పొందాడు సదరు రైతు.
సుధాకర్ రెడ్డి అనే మరో రైతు కొలార్ లోని ఏపీఎంసీ మార్కెట్లు తీసుకొచ్చిన టమోటా బాక్సులు ఒక్కొక్కటి వేలంలో రూ.2200 నుంచి రూ.1500 పలికాయి. 2021 నవంబర్ లోనూ 15 కిలోల టమోటా బాక్స్ రూ.2000 పలికిందని సుధాకర్ రెడ్డికి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మంగళవారం రిటైల్ మార్కెట్లో కిలో టమోటా ధర రూ.108.92 పలుకుతున్నది.