నేడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరైపోయింది. ముఖ్యంగా కరోనా వచ్చిన దగ్గర్నుంచి దీనికున్న ప్రాధాన్యత గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఆరోగ్య బీమాపై అవగాహన లేక మనలో చాలామంది దొరికిన పాలసీని తీ సుకుని ధీమాగా ఉండిపోతున్నారు. కానీ ఆపత్కాలంలో ఆ బీమా ఎందుకూ పనికిరాక చివరకు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే సమగ్రమైన ఆరోగ్య పాలసీనే తీసుకోవాలి. పాలసీ ప్రయోజనాలను ఆరాతీస్తే అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందుకోవచ్చు.