హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలుగు స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన టీ కన్సల్ట్.. తొలిసారిగా గ్లోబల్ ఇన్వెస్టర్ పూల్‌ను ప్రారంభించింది.
ఈ విషయాన్ని కంపెనీ సీఈవో సందీప్ మక్తల తెలిపారు. దుబాయ్ వ్యాపారవేత్త బూ అబ్దుల్లాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు, తద్వారా మన వ్యాపారాలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుంటుందన్నారు.
అంతర్జాతీ య స్థాయిలో పేరొందిన అబ్దుల్లా కంపెనీతో టీ కన్సల్ట్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఎంతో మేలు చేయనున్నదని, ముఖ్యంగా ఆవిష్కరణ రంగంలో ప్రత్యేక నైపుణ్యతను కలిగివున్న తెలుగు వారికి అంతర్జాతీయ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఇది మంచి వేదికని సందీప్ మక్తల తెలిపారు.