తెలుగులో వాదనలు సరికాదు : హైకోర్టు
ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్‌కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్కొన్నది.
- న్యాయవాదిని నియమించుకోవాలని పిటిషనర్‌కు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్‌కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్కొన్నది. నాలుగు వారాల్లోగా న్యాయవాదిని నియమించుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కోర్టు కేసుల విచారణ ప్రక్రియ ఇంగ్లిషులో కొనసాగించాలనే నిబంధన ఉన్నదని గుర్తుచేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు 22కుపైగా కాంట్రాక్ట్‌లు ఇచ్చిన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ 2020లో ఖమ్మం జిల్లా సీతారాంపురానికి చెందిన తుమ్మలపల్లి రాంబాబు పార్టీ ఇన్‌పర్సన్‌గా పిల్ దాఖలు చేయగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తెలుగులో వాదనలు వినిపిస్తూ సమాచార హకు చట్టం కింద కాంట్రాక్టర్‌కు చెందిన అక్రమాలపై సమాచారంతో పిల్ వేసినట్టు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇంగ్లిషులో వాదించాలని కోరింది. లేనిపక్షంలో న్యాయవాదిని నియమించుకోవాలని, ఒకవేళ నియమించుకోలేకపోతే న్యాయసేవాధికార సంస్థ ద్వారా తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

