న్యూఢిల్లీ, నవంబర్ 21 : మోసం, వృథా, పాలసీ ఉల్లంఘనలు తదితర వ్యవస్థీకృత లీకేజీలతో దేశీయ బీమా రంగం ఏటా రూ.10,000 కోట్ల మేర నష్టపోతున్నదని ఓ తాజా రిపోర్టు వెల్లడించింది. దీంతో బీమా రంగంలో విశ్వసనీయత నిశ్శబ్దంగా అంతరించిపోతున్నదని సదరు నివేదిక పేర్కొన్నది.
బీమా సంస్థలు, కార్పొరేట్లు, ప్రభుత్వం, రెగ్యులేటర్లు దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.