హైదరాబాద్, జూలై 16: అమెరికాకు చెందిన సింక్రోని ..ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో మూడో అతిపెద్ద సెంటర్ ఇదే కావడం విశేషం. మిగతా రెండు సెంటర్లు అమెరికాలో నెలకొల్పింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎంటర్ప్రైజెస్ హబ్‌గా కొనసాగుతున్న భారత్‌లో అతిపెద్ద సెంటర్‌ను ఏర్పాటు చేయడం విశేషమని కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారి ఫ్లోరిన్ అర్గిరెక్యూ తెలిపారు.
అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు భారత్ కేంద్రంగా మారుతున్నదని, ముఖ్యంగా టెక్నాలజీ, ఆపరేషన్స్, అనలిటిక్స్, మార్కెటింగ్ విభాగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు. 6 వేల మందికి పైగా కూర్చోవడానికి వీలుగా డిజైన్ చేసిన ఈ సెంటర్‌తో అంతర్జాతీయంగా ఉన్న క్లయింట్లకు ఇక్కడి నుంచే సేవలు అందించనున్నట్టు తెలిపారు.