Symphony | హైదరాబాద్, ఆగస్టు 7: కూలర్ల తయారీ సంస్థ సింఫనీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నులు చెల్లించిన తర్వాత రూ.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే కంపెనీ ఆదాయం రూ.302 కోట్ల నుంచి 76 శాతం వృద్ధితో రూ.531 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ(కార్పొరేట్ వ్యవహారాలు) నృపేశ్ షా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కూలర్లకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే గత త్రైమాసికంలో అంచనాలకుమించి రాణించినట్లు చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 7: సింగరేణి ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను స్టాండలోన్ ప్రతిపాదికన పన్నులు చెల్లించిన తర్వాత రూ.495.98 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది వచ్చిన రూ.331.02 కోట్ల కంటే ఇది 49.83 శాతం అధికం. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,689.65 కోట్ల నుంచి రూ.2,901.53 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో సంస్థ 28.46 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.