Suzuki e-Access | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ రేసులోకి ఎంటరైంది. తాజాగా ఈ-యాక్సెస్ స్కూటర్ ఆవిష్కరించింది. దాంతోపాటు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో తొలి రోజు న్యూ యాక్సెస్ 125(new Access 125) స్కూటర్, గిక్సర్ ఎస్ఎఫ్ 250 ఫ్లెక్స్ ఫ్యుయల్ (Gixxer SF 250 Flex Fuel) మోటారు సైకిల్ ఆవిష్కరించింది.
3.07కిలోవాట్ల ఎల్ఐపీ (Lithium Iron Phosphate) బ్యాటరీతో వస్తున్న ఈ-యాక్సెస్ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 95 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటలకు 71 కి.మీ దూరం వెళుతుంది. పోర్టబుల్ చార్జర్ సాయంతో 6.42 గంటల్లో, ఫాస్ట్ చార్జర్‌తో 2.12 గంటల్లో చార్జింగ్ అవుతుంది. రెండు రైడింగ్ మోడ్స్, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ స్కూటర్. దీని ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఎకో, రైడ్ ఏ, రైడ్ బీ మోడ్స్‌లో లభిస్తుందీ స్కూటర్.
సైడ్ స్టాండ్ ఇంటర్ లాక్ సిస్టమ్ టిప్ ఓవర్ డిటెక్షన్, కీ ప్యాబ్ బేస్డ్ రిమోట్ వెహికల్ లాకింగ్ / అన్ లాకింగ్, మల్టీ ఫంక్షన్ స్టార్టర్ స్విచ్, కలర్ టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్, సుజుకి రైడ్ కనెక్ట్ ఈ-యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. త్రీ డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లు – మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2/ మెటాలిక్ మ్యాట్ బోర్డియక్స్ రెడ్, పెరల్ గ్రేస్ వైట్ లేదా మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ గ్రే, పెరల్ జేడ్ గ్రీన్ లేదా మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఆవిష్కరించిన తర్వాత దీని ధరను ప్రకటిస్తామని సుజుకి మోటార్ ఇండియా తెలిపింది.