Tata Motors | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) కీలక మైలురాయిని చేరుకున్నది. టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్ (Tata Nexon), టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారీ (ఓల్డ్ అండ్ న్యూ) (Tata Safari- Old and News), టాటా సియర్రా (Tata Seirra) వంటి తమ ఎస్యూవీ కార్ల విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటాయని మంగళవారం టాటా మోటార్స్ ప్రకటించింది. 1991లో టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో తొలిసారి ఎస్యూవీ టాటా సియర్రా (Tata Sierra) కారును ఆవిష్కరించింది. అటుపై 2014 ఆటో ఎక్స్ పోలో టాటా నెక్సాన్, సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారు టాటా పంచ్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. తన ఎస్యూవీ కార్ల విక్రయాలు 20 లక్షల మైలురాయిని దాటిన సందర్భంగా వాటిపై రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
దేశంలోని ఇతర కార్ల తయారీ కంపెనీలతో పోలిస్తే టాటా మోటార్స్ (Tata Motors) కార్లన్నీ గ్లోబల్ ఎన్-క్యాప్, భారత్ ఎన్-క్యాప్ వద్ద 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్లుగా ఉన్నాయి. ఇక టాటా హారియర్ (Tata Harrier) రూ.14.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), టాటా సఫారీ (Tata Safari) రూ.15.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. వీటిలో సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.1.40 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది. వీటితోపాటు టాటా నెక్సాన్.ఈవీ (Tata Nexon.ev) కారుపై రూ.1.30 లక్షలు, టాటా పంచ్.ఈవీ (Tata Punch.ev) కారుపై రూ.30 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. తన ఎస్ యూవీ కార్లపై ఆఫర్లు ఈ నెల 31 వరకూ ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది.