నూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ కేసులో వీరిద్దరు అరెస్ట్ అక్రమమంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీంతో శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఈ నోటీస్‌లో ఆదేశించింది. డిసెంబర్ 23, 2022లో వీరిద్దిరిని సీబీఐ అరెస్ట్ చేసింది.