కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానాన్ని అమలులోకి తెచ్చిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు తమ సిబ్బందిని ఆఫీసులకు రప్పించే విషయంలో డైలమాలో ఉన్నాయా?. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఆయా కంపెనీల సీఈవోలు వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ అండ్ రిమోట్ వర్క్, హైబ్రీడ్ మోడల్ ఆఫ్ వర్కింగ్ విధానాలను అమలు చేసే విషయంలో గందరగోళంలో ఉన్నారని తెలుస్తోంది.
వర్క్ ఫ్రం హోం స్థానంలో సెర్చింజన్ గూగుల్.. న్యూ ఫ్లెక్సిబుల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. మిగతా రెండు రోజులు ఇంటివద్ద నుంచి గానీ.. ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించొచ్చు.. గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచ్చాయ్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. తమ సంస్థ 3/2 మోడల్ పని విధానాన్ని ప్రతిపాదిస్తున్నదని తెలిపారు.
మూడు రోజులు ఆఫీసులో విధులకు హాజరై.. మిగతా రెండు రోజులు ఎక్కడినుంచైనా పని చేయడానికి వీలు కల్పించడంతో ఉద్యోగులకు మంచి బ్యాలెన్స్ అవుతుందంటున్నారు సుందర్ పిచ్చాయ్. ఉద్యోగులు తమ ఇంటి వద్ద ఉన్నప్పుడు.. ఆఫీసులో వారి కొలీగ్స్‌తో ఉంటారు అంటున్నారాయన. గూగుల్ మూడు రోజుల ఆఫీసు.. రెండు రోజులు వర్క్ ఫ్రం హోం పాలసీని అమలు చేయబోతున్నదని సంకేతాలిచ్చారు.
ఉదాహరణకు న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో నివాసం ఉంటున్న తమ సంస్థ ఉద్యోగులు ఆఫీసులకు రావాలంటే సుదూర ప్రయాణం చేయడం నిజమైన ఇష్యూ.. ఇటువంటి వారంతా 3/2 విధానాన్ని ఎంచుకోవడం బెటర్ తన అభిప్రాయం అని వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటర్ ఇన్‌చీఫ్ మ్యాట్ ముర్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచ్చాయ్ తెలిపారు.
ఇప్పుడు దాదాపు రెండేండ్ల తర్వాత కార్యాలయాలకు వస్తున్న ఉద్యోగులకు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించడానికి ఒక రోజు పడుతుంది. కరోనా మహమ్మారి వల్ల దాదాపు అన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో.. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల సహకారం లేకుండా పని చేస్తూ వచ్చారు.
ఐటీ దిగ్గజ సంస్థల ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు తిరిగి రావడం అంటే న్యూ రొటిన్యూగా మారనున్నది. ఈ న్యూ రోటిన్యూలో కుటుంబ, ఆఫీసు సమయాలను బ్యాలెన్స్ చేసుకోవడం ఐటీ ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ అగ్రస్థానం
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళపై కన్నేసి ఆపై లైంగిక దాడి!
నంబర్ 16 నుంచి ‘ఇండియాజాయ్’.. తెలంగాణ ప్రభుత్వం మద్దతు