ముంబై, సెప్టెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.83 పాయింట్లు నష్టపోయి 74,781.76 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 79.70 పాయింట్లు కోల్పోయి 23,39 8.10 వద్ద స్థిరపడింది. నిజానికి ఒకానొక దశలో సెన్సెక్స్ 742.43 పాయింట్లు, నిఫ్టీ 246.40 పాయింట్లు పడిపోయాయి. అయితే ఐటీ తదితర రంగాల్లో కొనుగోళ్లు, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు నష్టాల తీవ్రతను తగ్గించాయి. ఇక టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు క్షీణించాయి.
రంగాలవారీగా రియల్టీ అత్యధికంగా 2.69 శాతం నష్టపోగా, మెటల్ 2.40 శాతం, కమోడిటీస్ 1.61 శాతం, ఎనర్జీ 1.06 శాతం మేర పతనమయ్యాయి. ఆర్థిక సేవలు, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ, టెలికాం, బ్యాంకింగ్, ఫోకస్డ్ ఐటీ సూచీలు లాభపడినా సూచీలను లాభాల్లోకి తీసుకురాలేకపోయాయి. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 1,733.67 పాయింట్లు నిఫ్టీ 499.6 పాయింట్లు దిగజారాయి.