న్యూఢిల్లీ, మార్చి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. దీంతో వరుసగా రెండు రోజులుగా లాభపడిన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ బుసలు కొడుతుండటంతో దేశీయ మదుపరుల ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. ఫలితంగా ఇరు సూచీలు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. వారాంతపు ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టపోయి 73,583.22 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో 1,739 పాయింట్లు నష్టపోయింది. మరో సూచీ నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం కోల్పోయి 22,819.60 వద్ద స్థిరపడింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.8,86,383.92 కోట్లు కరిగిపోయి రూ.4,22,15,450.82 కోట ్ల(4.46 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. బ్లూచిప్ సంస్థల షేర్లు అత్యధికంగా నష్టపోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55 శాతం నష్టపోవడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.87,014 కోట్లు కరిగిపోయి రూ.18,24,515.62 కోట్లకు పడిపోయింది. వీటితోపాటు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోగా.. టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్, సన్‌ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. అన్ని రంగాల సూచీలు పతనం చెందాయి.
పతనానికి కారణాలు