Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధ మేఘాలు తొలగుతాయన్న అంచనాలే కారణమా..?
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (BSE Sensex) 1100 పాయింట్ల వరకు పెరిగింది. సెన్సెక్స్ నేటి ట్రేడింగ్‌లో 76,135 వద్ద మొదలైంది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (BSE Sensex) 1100 పాయింట్ల వరకు పెరిగింది. సెన్సెక్స్ నేటి ట్రేడింగ్‌లో 76,135 వద్ద మొదలైంది. చివరకు 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకి, 24 వేల పైన స్థిరపడింది. నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, లార్సెన్ షేర్లు రాణించాయి. మ్యాక్స్ హెల్త్‌కేర్, ఓఎన్జీసీ, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో స్టాక్స్ నష్టపోయాయి.
యుద్ధం ముగించే విషయమై అమెరికా – ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 5.58 శాతం తగ్గి, 97.76 డాలర్లకు వచ్చింది. చమురు ధరలు తగ్గడంతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. ఆయిల్ ధరల తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని, వడ్డీ రేట్లలో స్థిరత్వం వస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా నేటి లాభాలకు ఓ కారణంగా చెప్పవచ్చు.
అమెరికా-భారత్ మధ్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని ఆశిస్తున్నామని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించడం కూడా మార్కెట్లకు జోష్‌ను ఇచ్చింది. ఈ క్రమంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా 35 పైసల మేర కోలుకుంది. ప్రస్తుతం రూపీ వాల్యూ 95.25 వద్ద స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

