Stock market : ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖరి అరగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. దాంతో పీఎస్‌యూ బ్యాంక్ ఇవాళ ఏకంగా 1.17 శాతం లాభపడింది.
అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలకు కలిసొచ్చింది. ఇవాళ ట్రేడింగ్ మొదలవగానే మెటల్, ఐటీ షేర్లు భారీగా పడిపోవడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఒకానొక దశలో 84,029 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 84,562 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.
అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ఒక దశలో 25,740 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో 25,910 వద్ద ముగిసింది. బీఎస్ఈలో TMCV, Eternal, Axis Bank టాప్ గెయినర్స్‌గా, Infosys, TATA steel, TMPV టాప్ లూజర్స్‌గా నిలిచాయి. ఇక ఎన్ఎస్ఈలో MCV, Eternal, BEL లాభాల్లో ముగియగా.. Infosys, Eicher motors, Tata steel నష్టాలు మూటగట్టుకున్నాయి.