ముంబై, ఏప్రిల్ 18 : స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ తగ్గాయి. బ్యాంకింగ్, పవర్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి. బ్లుచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు నష్టపోవడం కూడా మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చింది.ప్రారంభంలో లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్ చివరకు 183.74 పాయింట్లు నష్టపోయి 59,727 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.70 పాయింట్లు కోల్పోయి 17,660 వద్ద ముగిసింది. పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు
నష్టపోగా.. నెస్లె, హెచ్‌సీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, మారుతి, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్‌లు లాభపడ్డాయి.