Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 61వేల మార్క్‌ను దాటింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 18,300 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 61,716 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,332 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ప్రారంభ ట్రేడింగ్‌లో జొమాటో షేర్లు పదిశాతం లాభాన్ని ఆర్జించగా.. అపోలో హాస్పిటల్ షేర్లు నాలుగు శాతం వరకు పెరిగాయి. మరో వైపు యూఎస్ స్టాక్ మార్కెట్లు సైతం గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్జీఎస్ నిఫ్టీ 18,400, హాంగ్‌సెంగ్ 17180.50, నిక్కీ 28263.57 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్‌లో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ భారీగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ స్టాక్‌లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ఐటీ 2.94 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 1.63 శాతం లాభపడ్డాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఆటో తదితర రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐచర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.