Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా మినహా అన్నిరంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 315.06 పాయింట్లు పతనమై.. 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు తగ్గి 24,246.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 3శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 7 శాతం పెరిగింది. తొలి గంటలో ప్లాట్‌గా మొదలైన సూచీలు.. ఆ తర్వాత మిగతా అన్ని సెషన్లలోనూ ప్రతికూలంగా ట్రేడయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 80,058.43 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు.
ఇంట్రాడేలో 80,173.92 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 79,724.55 పాయింట్లకు తగ్గింది. చివరకు 315.06 పాయింట్లు పతనమై.. 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు తగ్గి.. 24,246.70 వద్ద స్థిరపడింది. గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 1869 షేర్లు లాభపడగా.. 1921 షేర్లు పతనయ్యాయి. నిఫ్టీలో హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్ నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ ఒక్కొక్కటి ఒకశాతం క్షీణించగా.. ఫార్మా ఇండెక్స్ ఒకశాతం పెరిగింది.