Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 16.82 పాయింట్ల పతనంతో 80,065.16 పాయింట్ల వద్ద స్థిర పడగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 36.10 పాయింట్ల నష్టంతో 24,399.40 పాయింట్ల వద్ద నిలిచింది. మధ్యాహ్నం తర్వాత బీఎస్ఈ-30 సెన్సెక్స్ లోని సగానికి పైగా స్టాక్స్ లాభాల్లో సాగాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్ 2.3 శాతం, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పవర్ గ్రిడ్ పుంజుకున్నాయి.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఆరు శాతం నష్టపోగా నెస్లే ఇండియా, మారుతి సుజుకి, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్సు గరిష్టంగా 2.84 శాతం నష్టపోగా, రియాల్టీ 1.10 శాతం పతనమైంది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఐటీ, మీడియా స్టాక్స్ నష్టపోయాయి.
దీనికి భిన్నంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్యూ బ్యాంకులు) ఇండెక్సు 1.19 శాతం, లాభంతో ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 0.66 శాతం, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ 0.58 శాతం లాభ పడ్డాయి. ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్సులు కూడా లాభాల్లో ముగిశాయి.