Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 241.30 పాయింట్ల నష్టంతో 77,339.01 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 78.90 పాయింట్ల పతనంతో 23,453 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 77,886.97 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. 76,965.06 పాయిట్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం అంతర్గత ట్రేడింగ్ లో 23,606.80 పాయింట్ల నుంచి 23,350.40 పాయింట్ల మధ్య తచ్చాడింది.
నిఫ్టీ -50లోని 29 స్టాక్స్ – టీసీఎస్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా 3.11 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు హిందాల్కో, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్ సహా 21 స్టాక్స్ 3.79 శాతం వరకూ లాభ పడ్డాయి. ఎస్బీఐ తన 15 ఏండ్ల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు 7.23 శాతం వృద్ధితో రూ.10 వేల కోట్ల నిధులు సేకరించింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ -100 ఇండెక్స్ 0.53 శాతం నష్టపోతే నిఫ్టీ మిడ్ క్యాప్ -100 ఇండెక్స్ ఫ్లాట్ గా ముగిసింది.
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.32 శాతం నష్టపోగా, కొఫోర్గ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్టీటీఎస్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా, సీపీఎస్ఈ, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి. మరోవైపు, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ బ్యాంకింగ్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్సియల్, నిఫ్టీ కన్జూమర్ డ్యూరబుల్ ఇండెక్సులు 1.90 శాతం లాభాలతో ముగిశాయి.