Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్ నోట్తో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 703.38 పాయింట్లు లాభంతో 79,747.12 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 79,923.90 పాయింట్ల నుంచి 79,026.18 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 216.95 పాయింట్లు పుంజుకుని 24,131.10 పాయింట్ల వద్ద ముగింది.
ఎన్ఎస్ఈ-50లో 43 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్ స్టాక్స్ 4.40 శాతం వరకూ లాభ పడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరాం ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే ఇండియా 1.35 శాతం వరకూ నష్టపోయాయి. ఇదిలా ఉంటే రిలయన్స్ షేర్ 1.63 శాతం లాభంతో ముగిసింది.నిఫ్టీ మిడ్ క్యాప్ 0.16 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.75 శాతం వృద్ధి చెందాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ రియాల్టీ మినహా అన్ని ఇండెక్సులు లాభ పడ్డాయి. నిఫ్టీ ఫార్మా 2.35 శాతం, నిఫ్టీ హెల్త్ కేర్ 2.04శాతం లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్-30లో భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ లాభ పడితే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్పోసిస్ నష్టాలతో స్థిర పడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 72.67 డాలర్లు, ఔన్స్ బంగారం 2662 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.