ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సూచీ సెన్సెక్ 388 పాయింట్లు నష్టపోయి.. 58,576 పాయింట్ల వద్ద.. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పోయి 17,530 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 345 పాయింట్లు నష్టపోయి 58,619 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 106 నష్టపోయి 17,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి. సోమవారం సైతం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి.
రియాల్టీ, మెటల్ సూచీలు 2.5 శాతానికిపైగా క్షీణించగా, బ్యాంకింగ్ స్టాక్స్ కనిష్ఠ స్థాయి నుంచి భారీగా కోలుకున్నాయని ఆయన కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ నిఫ్టీ నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 1-2 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లో కొద్దిమేర కొనుగోళ్లు కనిపించాయి.