Sensex : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,066 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే రూ.9 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం ఉదయం నుంచే ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం 83,207.38 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
అంతకుముందు రోజు ముగింపుతో పోలిస్తే దాదాపు 40 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగి.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 82,010.58 పాయింట్లను తాకింది. తర్వాత 1,065.71 పాయింట్లు నష్టపోయి 82,180.47 వద్ద ముగిసింది. సెన్సెక్స్ దాదాపు 1.28 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 353 పాయింట్ల నష్టంతో 25,232.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్ డీఎఫ్ సీ మాత్రమే లాభపడగా, మిగతా ప్రధాన షేర్లు నష్టపోయాయి.
మొత్తంగా మంగళవారం ఒక్క రోజే దాదాపు రూ.9 లక్షల కోట్లు ఇన్వెస్టర్లు నష్టపోయారు. అంతర్జాతీయ వాణిజ్య సరళి, టారిఫ్ల మోత, ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాలు, గ్లోబల్ పాలిటిక్స్ వంటివి సెన్సెక్స్ పతనానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.