Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఫలితంగా మార్కెట్ల నష్టాల్లో కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 79,915.00 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. చివరకు వరకూ ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. ఇంట్రాడేలో 80,067.46 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఒక దశలో 79,731.83 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 36.22 పాయింట్ల నష్టంతో 79,960.38 స్థిరపడింది. నిఫ్టీ క్రితం సెషన్‌తో పోలిస్తే స్వల్ప లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి నష్టాల్లోకి వెళ్లింది. ఆఖరి సెషన్లో స్వల్పంగా కోలుకున్నది.
చివరకు 3.30 పాయింట్ల నష్టంతో 24,320.55 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,570 షేర్లు పురోగమించగా, 1988 షేర్లు క్షీణించాయి. మరో 95 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభపడ్డాయి. దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. రంగాలవారీగా పరిశీలిస్తే.. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ 0.6-1.5 శాతం పెరిగాయి. ఆటో, బ్యాంక్, హెల్త్‌కేర్, మెటల్, రియల్టీ, పవర్, టెలికాం 0.4-0.8 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.