Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండోరోజు సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. వాస్తవానికి యూఎస్ ఫెడ్ కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో మొదలై.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కొలుకున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ తొలిసారిగా పాయింట్ల వద్ద 83,152.41 తొలిసారిగా ఆల్‌టైమ్ హైకి చేరుకున్నది. ఇంట్రాడేలో 82,866.68 పాయింట్లకు తగ్గింది. చివరకు 90.88 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 34.80 పాయింట్ల లాభంతో 25,418.55 వద్ద స్థిరపడింది. లిస్టెడ్ కంపెనీల్లో 1,713 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 2,236 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, లార్సెన్, కోటక్ మహీంద్రా, బ్రిటానియా, సిప్లా, ఓఎన్జీసీ, టాటా కంపెనీ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్ అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పేయింట్స్, బీపీసీఎల్, ఐటీసీ నష్టాల్లో ముగిశాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లో నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.5శాతం, నిఫ్టీ ఆటో 0.3శాతం పెరిగాయి. మీడియా, పీఎస్‌యూ, మెటల్ నష్టాల్లోకి జారుకున్నాయి.