Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో మొదలైనా.. చివరిగంటలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. చివరి సెషన్లో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 79,921.13 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలవగా.. ఇంట్రాడేలో 80,646.31 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఒక దశలో 79,891.68 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది.
చివరకు 138.74 పాయింట్ల నష్టంతో 80,081.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.60 పాయింట్ల పతనంతో 24,435.50 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్స్యూమర్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. సెక్టార్లలో ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, పవర్, ఫార్మా ఒకశాతం చొప్పున పతనమయ్యాయి.