Reddys Lab | రెడ్డీస్ లాభం 1,379 కోట్లు.. క్యూ3లో 11 శాతం పెరిగిన ప్రాఫిట్
Reddys Lab | రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
మరో త్రైమాసికంలో రికార్డు స్థాయి విక్రయాలను కనబరిచాం. నూతన ఔషధాలను యూరప్, అమెరికా మార్కెట్లోకి విడుదల చేయడం కలిసొచ్చింది. అనుబంధ వ్యాపారాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలను వేగవంతం చేయడంతోపాటు మాలుక్యుల్స్ కోసం వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నాం.
– జీవీ ప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ
Reddys Lab | హైదరాబాద్, జనవరి 30: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,247 కోట్లతో పోలిస్తే 11 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.6,770 కోట్ల నుంచి రూ.7,215 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం కంపెనీకి కలిసొచ్చింది. ముఖ్యంగా ఇక్కడి మార్కెట్లోకి కొత్త ఔషధాలను విడుదల చేయడంతోపాటు గత మందులకు డిమాండ్ అధికంగా ఉండటం కూడా ఆదాయం పెరగడానికి దోహదం చేసినట్లు వెల్లడించింది.
- ఉత్తర అమెరికాలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం ఎగబాకి రూ.3,349 కోట్లకు చేరుకున్నాయి.
- యూరప్ నుంచి రావాల్సిన ఆదాయం 15 శాతం ఎగబాకి రూ.500 కోట్లకు చేరాయి.
- భారత్‌లో కంపెనీ ఔషధాలను విక్రయించడంతో రూ.1,180 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే త్రైమాసికం కంటే ఇది 5 శాతం అధికం.
- అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి రూ.1,283 కోట్లు లభించాయి.
- అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలు విక్రయించడంతో రూ.6,309 కోట్ల నిధులు సమకూరాయి.
- ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో రూ.20,833 కోట్ల ఆదాయంపై రూ.4,261 కోట్ల నికర లాభాన్ని గడించింది.
- ఔరిజెన్ ఆంకాలజీలో రూ.650 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు బోర్డు అనుమతినిచ్చింది.
- కంపెనీ షేరు ధర రూ.5,845.75 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

