న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకున్నది. సరాసరిగా ఏడాది తర్వాత తొలిసారిగా ఆగస్టు నెలలో ఈ నెట్‌వర్క్‌ను అత్యధిక మంది ఎంచుకున్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతోపాటు దేశీయ టెలికాం దిగ్గజం జియోతోపాటు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా చాలా మంది చేరారని తెలిపింది.
జూలై చివరినాటికి 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్‌స్ర్కైబర్లు ఆ తర్వాతి నెల చివరినాటికి 122.45 కోట్లకు చేరుకున్నారని తన నెలవారి సమీక్షలో వెల్లడించింది. కొత్తగా ఆగస్టు నెలలో 35.19 లక్షల మంది జతయ్యారు. వీరిలో జియోకు అత్యధికంగా 19 లక్షల మంది చేరగా, బీఎస్ఎన్ఎల్కు 13.85 లక్షలు, ఎయిర్టెల్ పరిధిలోకి 4.96 లక్షల మంది చేరారు.
ప్రైవేట్ టెలికాం ఆఫరేటర్లు టారిఫ్ రేట్లను పెంచుతూ గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకోవడంతో ఆ నెలలో బీఎస్ఎన్ఎల్ సేవలను లక్షలాది మంది ఎంచుకున్నారు. మళ్లీ ఏడాది తర్వాత ఆగస్టు నెలలోనే భారీగా సబ్‌స్ర్కైబర్లు చేరడం విశేషం.