హైదరాబాద్, నవంబర్ 28: గడిచిన ఐదేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో రూ.3,330 కోట్ల విలువైన క్లెయింలను సెటిల్మెంట్ చేసినట్లు స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సనత్ కుమార్ తెలిపారు.
అదే దేశవ్యాప్తంగా నిమిషానికి నాలుగు చొప్పున 1.1 కోట్ల క్లెయింలను సెటిల్ చేసినట్లు, వీటి విలువ రూ.52 వేల కోట్లని ఆయన చెప్పారు. మరోవైపు, ఆరోగ్య పాలసీలపై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేయాలని దీంతో సామాన్యులకు తక్కువకే పాలసీలు లభిస్తాయన్నారు. మరోవైపు, ఇంటివద్దనే హెల్త్‌కేర్ సేవలనూ ప్రారంభించామని, తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరులలో అందుబాటులో ఉంటాయన్నారు.