ముంబై, డిసెంబర్ 11: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్..హైదరాబాద్, లక్నోలకు రాయ్పూర్, ఝర్సుగూడ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. జనవరి 1 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నూతన సర్వీసును ప్రారంభించబోతున్నట్లు, దీంతో మొత్తం రూట్ల సంఖ్య 24కి చేరుకున్నట్లు తెలిపింది.
మారుతి 8 వేల టచ్పాయింట్లు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మారుతి సుజుకీ 2030-31 నాటికి దేశవ్యాప్తంగా 8 వేల టచ్పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నెక్సా, అరేనా టచ్పాయింట్లు కలుపుకొని మొత్తం గా 5,240 నిర్వహిస్తున్నది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి ఏర్పాటు చేసిన నెక్సాలో 500వ టచ్పాయింట్ను బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మారుతి ఎండీ హిసాచీ తకేచి మాట్లాడుతూ.. టచ్ పాయింట్లు లేక ఇబ్బందులు పడుతున్న కస్టమర్లకు సేవలు అందించాలనే వీటిని పెంచుతున్నట్లు చెప్పారు.