రెడ్డీస్ లాభం 76 శాతం డౌన్
కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా క్షీణించింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో ఈ లాభం రూ. 362.4 కోట్లు
చరాస్తుల విలువ తగ్గింపు దెబ్బ
ఆదాయం రూ.5,437 కోట్లు
హైదరాబాద్, మే 19 (బిజినెస్ బ్యూరో): కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా క్షీణించింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో ఈ లాభం రూ. 362.4 కోట్లు. తాజా త్రైమాసికంలో రూ. 510 కోట్ల నికరలాభాన్ని ఆర్జించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన మేరకు ఇంపైర్మెంట్ ఛార్జీలను భరించినందున లాభం తగ్గిందని కంపెనీ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ గురువారం మీడియాకు తెలిపారు. టెపిలమైడ్ ఫుమరేట్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ల మార్కెట్ అవకాశాలు తగ్గినందున రూ.430 కోట్లు, అమెరికాలోని ష్రెవెపోర్ట్ ప్లాంట్ ఆస్తులు, గుడ్‌విల్‌కు రూ.310 కోట్లు..మొత్తం రూ. 760 కోట్ల ఇంపైర్మెంట్ ఛార్జీలను కంపెనీ ఖాతాల్లో చూపించింది.
ఫలితాల వివరాలు:
- మార్చి త్రైమాసికంలో ఆదాయం 15 శాతం వృద్ధిచెంది రూ. 5,437 కోట్లకు చేరింది.
- పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల నికరలాభం ఆర్జించింది.
- ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచే ఒక బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది.
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తమ వ్యాపారంపై పడలేదని, చెల్లింపుల సమస్య ఏర్పడలేదని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
- రష్యాతో సహా ఇతర వర్థమాన మార్కెట్ల నుంచి నాల్గో త్రైమాసికంలో ఆదాయం 36 శాతం వృద్ధితో రూ. 1,201 కోట్లకు పెరిగింది.
- పూర్తి ఏడాదిలో రష్యా నుంచి ఆదాయం 32 శాతం వృద్ధితో రూ. 2,090 కోట్లకు చేరింది.
- భారత్‌లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 969 కోట్ల వద్ద నిలిచింది.
- రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.30 లేదా 600 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది.
జూలైకల్లా డీసీజీఐ చెంతకు స్పుత్నిక్ లైట్

కొవిడ్ బూస్టర్ డోస్ స్పుత్నిక్‌లైట్ వ్యాక్సిన్‌కు జూన్ చివరినాటికి లేదా జూలై తొలినాళ్లలో రెగ్యులేటర్ అనుమతి కోసం వెళతామన్న ఆశాభావాన్ని డాక్టర్ రెడ్డీస్ వ్యక్తం చేసింది. కంపెనీ సీఈవో దీపక్ సప్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 12-17 సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్-ఎం వ్యాక్సిన్‌ను నిలిపివేశామని, స్పుత్నిక్ లైట్‌పై దృష్టినిలిపామని, దీని ధరను నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏ ఇతర వ్యాక్సిన్ తీసుకున్నవారైనా బూస్టర్‌డోస్‌గా స్పుత్నిక్ లైట్ టీకాను వేసుకోవచ్చని, ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయని, అటుతర్వాత రెగ్యులేటర్ డ్రగ్గ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సంప్రదిస్తామన్నారు. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వాడకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో డీసీజీఐ అనుమతించింది. ఇండియాలో ఇప్పటివరకూ 12 లక్షల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ టీకాలను విక్రయించినట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

