Spotify Layoffs | స్పాటిఫైలో ఆగని కొలువుల కోత : 200 మందిపై మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం వేటు
మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify Layoffs) పాడ్‌కాస్ట్ డివిజన్లో 200 మంది ఉద్యోగులను తొలగించనుంది. స్ధూల ఆర్ధిక పరిస్ధితులను సాకుగా చూపి స్పాటిఫై 600 మంది ఉద్యోగులపై వేటు వేసిన ఐదు నెలల తర్వాత లేటెస్ట్ లేఆఫ్స్‌కు తెగబడింది.
న్యూఢిల్లీ : మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify Layoffs) పాడ్‌కాస్ట్ డివిజన్లో 200 మంది ఉద్యోగులను తొలగించనుంది. స్ధూల ఆర్ధిక పరిస్ధితులను సాకుగా చూపి స్పాటిఫై 600 మంది ఉద్యోగులపై వేటు వేసిన ఐదు నెలల తర్వాత లేటెస్ట్ లేఆఫ్స్‌కు తెగబడింది. పాడ్‌కాస్ట్ డివిజన్లో వ్యవస్ధాగత మార్పుల ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పాటిఫై పాడ్‌కాస్ట్ బిజినెస్ వీపీ, హెడ్ సహర్ ఎలబషి బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
లేఆఫ్స్‌ను కంపెనీ సమర్ధించుకుంటూ జాబ్ కట్స్ ప్రస్తుత వాతావరణంలో సరైన నిర్ణయమేనని పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోయే వారికి స్పాటిఫై అండగా ఉంటుందని, వారి పట్ల గౌరవంగా, సహానుభూతితో వ్యవహరిస్తామని స్పాటిఫై పాడ్‌కాస్ట్ బిజినెస్ హెడ్ ఎలబషి పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులకు సమాచారం చేరవేయగా హెచ్ఆర్తో ముఖాముఖికి కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
గత దశాబ్ధ కాలంగా పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ప్రముఖ ప్లేయర్లు ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఎక్కువ మంది శ్రోతలను ఆకట్టుకునేందుకు స్పాటిఫై పలు పాపులర్ సిరీస్‌లతో పాటు, హై ప్రొఫైల్ డీల్స్‌తో ముందుకొచ్చింది. ఇదే సమయంలో అమెజాన్ సైతం అడిబుల్ వంటి తన యాప్స్‌లో పాడకకాస్ట్స్ను విస్తరిస్తోంది.
Read More
Bank of Baroda | ఇక డెబిట్ కార్డు అక్కర్లేదు.. యూఐపీ ద్వారానే ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయొచ్చు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

