న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్ము-శ్రీనగర్‌ల మధ్య విమాన టిక్కెట్టును రూ.1,122గా నిర్ణయించింది. ఈ నెల 31లోగా బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకే ఈ ఆఫర్ వర్తించనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15లోగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.