SpiceJet | దేశీయ విమానయాన సంస్థల్లో స్పైస్ జెట్ (Spice Jet) ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో మూడు నెలల పాటు 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలువులు మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రస్తుతం స్పైస్ జెట్ యాజమాన్యం విమాన సర్వీసుల నిర్వహణ తగ్గించేసింది. ప్రస్తుతం సుమారు 22 విమానాలు మాత్రమే నడుపుతున్నది. మరోవైపు, స్పైస్ జెట్ కార్యకలాపాలపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘా పెంచుతున్నట్లు ప్రకటించింది.
తాత్కాలికంగా 150 మంది క్రూ సిబ్బందికి వేతనం లేని సెలవు ఇస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నట్లు స్పైస్ జెట్ యాజమాన్యం వివరించింది. ప్రస్తుతం విమాన సర్వీసులకు గిరాకీ తగ్గడం, సంస్థ దీర్ఘకాలిక సుస్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెలవు ప్రకటించిన క్రూ సిబ్బంది స్పైస్ జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, వారి హెల్త్ బెనిఫిట్లు, ఎర్న్డ్ లీవ్స్ యధాతథంగా కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!