Ayodhya | ముంబై, జూన్ 12: హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రకటించింది. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ విమాన సర్వీసుకు డిమాండ్ లేమి కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్-అయోధ్యల మధ్య వారానికి మూడు సార్లు నడిపే సర్వీసును ప్రారంభించింది. డిమాండ్-సైప్లె ఆధారంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు, ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే జనవరి 21 నుంచి ఢిల్లీ నుంచి అయోధ్యకు సంస్థ విమానాన్ని నడుపుతున్నది.