న్యూఢిల్లీ, అక్టోబర్ 27: చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమాన సర్వీసులను భారీగా పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 125 రోజువారీ విమాన సర్వీసులను నడుపుతున్న సంస్థ..వచ్చే రెండు నెలల్లో వీటి సంఖ్యను రెట్టింపు స్థాయిలో పెంచుకోనున్నట్టు తెలిపింది.
వీటిలో భాగంగా నవంబర్ 1 నుంచి ముంబై-బెంగళూరుల మధ్య నూతన సర్వీసును నడుపబోతున్న సంస్థ..అలాగే చెన్నై-బెంగళూరు, ముంబై-అయోధ్య, హైదరాబాద్-అయోధ్య రూట్లలో కూడా సర్వీసును వచ్చే నెలలో ప్రారంభించనున్నది.