కోల్‌కతా, జనవరి 16: ఆర్పీ-గోయెంకాకు చెంది న రిటైల్ వెంచర్ స్పెన్సర్ తన పంథాను మార్చుకుంటున్నది. అతిపెద్ద అవుట్లెట్లతో ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో చిన్న స్థాయి రిటైల్ అవుట్లెట్లపై దృష్టి సారించింది. 8 వేల నుంచి 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తొలి విడుతలో భాగంగా దక్షిణాదిలో ఆరు చిన్న స్థాయి అవుట్లెట్లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ 23 లోపు వరంగల్‌తోపాటు కరీంనగర్, కర్నూల్, గుంటూరు, భీమవరం, విజయనగరంలో ఈ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ గ్రూపు హెడ్ శశ్వాత్ గోయెంకా తెలిపారు. ఈ మార్చి నాటికి స్టోర్ల సంఖ్యను 10కి పెంచుకోనున్నట్లు ప్రకటించిన ఆయన..క్రమంగా మరిన్ని నగరాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ స్టోర్లలో ప్రతిరోజు అన్ని ఉత్పత్తులపై కనీసంగా 6 శాతం రాయితీతో ఇస్తున్నది.