Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్ ధర గ్రాముకు 6,263.. రేపటి నుంచి ఇష్యూ ప్రారంభం
తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలులో ఉంటుంది. చివరకు ఈ నెల 16న ముగుస్తుంది.
Sovereign Gold Bond | ముంబై, ఫిబ్రవరి 10: తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలులో ఉంటుంది. చివరకు ఈ నెల 16న ముగుస్తుంది. ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే మూడు రోజుల బంగారం సగటు ధర (ఇష్యూకు ముందు మూడు పనిదినాల ముగింపు ధర) ఆధారంగా గోల్డ్ బాండ్లకు ధర నిర్ణయిస్తారు. బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపే మదుపుదారులకు నిర్ణీత ధరకంటే గ్రాముకు రూ.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తుంది. అంటే వారికి గోల్డ్ బాండ్ రూ.6,213 ధరకు లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, ఎంపికచేసిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బొంబే స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఈ బాండ్లను ఆర్బీఐ విక్రయిస్తుంది.
- గోల్డ్ బాండ్లకు వాటి ముఖవిలువపై 2.50 శాతం వార్షిక వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చొప్పున కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ ఇస్తుంది.
- ఈ సావరిన్ గోల్డ్ బాండ్ కాలపరిమితి ఎనిమిదేండ్లు కాగా, 5వ సంవత్సరం తర్వాత ముందుగానే రిడీమ్ చేసుకునే అవకాశం ఉన్నది.
- రుణాలు పొందేందుకు ఈ బాండ్లను తనఖాగా ఉపయోగించుకోవచ్చు.
- బంగారం కొనుగోలుకు వర్తించే కేవైసీ నిబంధనలే గోల్డ్ బాండ్లకూ వర్తిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

