తెలంగాణ, తమిళనాడులో అటాచ్ చేసిన ఈడీ అధికారులు
హైదరాబాద్, మార్చి 31 : తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాలకు మారకద్రవ్యాన్ని తరలించిన ఆరోపణలపై చెన్నైకి చెందిన సదరన్ అగ్రిఫురేన్ ఇండస్ట్రీస్ (ఎస్ఏఐపీఎల్)కి చెందిన రూ.294 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం జప్తు చేశారు. సదరు కంపెనీ తప్పుడు ఓడీ(ఓవర్సీస్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్)లు చూపి మొత్తం రూ.216.40 కోట్లను విదేశీ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఏఐసీఎల్కు తమిళనాడు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న రూ.294 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎక్కడెక్కడ ఆస్తులను జప్తు చేశారన్న వివరాలను ఈడీ అధికారులు వెల్లడించలేదు.