ORA | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. పోటీ వ్యతిరేక విధానాలు పాటిస్తుంచడంతోపాటు చట్ట విరుద్ధమైన పద్దతులను అవలంభిస్తున్నాయని ప్రధానంగా ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా రిటైల్ సంస్థలు, చిన్న రిటైలర్లు, దేశవ్యాప్తంగా పోటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాంపిటేషన్ యాక్ట్ 2002 చట్టాలను ఈ రెండు సంస్థలు పట్టించుకోవడం లేదు.