న్యూఢిల్లీ, జూలై 7: సోలార్ మాయల్స్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి రూ.3,011 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు సంస్థ బీఎస్ఈకి వివరించింది.
ఈ ఆర్డర్లలో భాగంగా 1,846 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను వచ్చే రెండేండ్లలో సరఫరా చేయాల్సివుంటుందని, ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ ఎండీ చిరంజీవి సాలుజా తెలిపారు.