Softbank – Paytm | 150 మిలియన్ డాలర్ల నష్టంతో పేటీఎం నుంచి సాఫ్ట్ బ్యాంక్ నిష్క్రమణ..!
Softbank - Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ నుంచి జపాన్ సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వైదొలిగింది.
Softbank – Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ నుంచి జపాన్ సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వైదొలిగింది. గత నెలలో 150 మిలియన్ డాలర్ల నష్టంతో వైదొలిగిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2017లో పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’లో సాఫ్ట్ బ్యాంక్ 150 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అయితే పేటీఎం నుంచి వైదొలిగే నాటికి సాఫ్ట్ బ్యాంక్ తన పెట్టుబడుల్లో 10-12 శాతం నష్టపోయిందని, దాని విలువ 150 మిలియన్ డాలర్లు ఉంటుందని ఆ వర్గాల కథనం.
2021లో పేటీఎం ఐపీఓకు వెళ్లే నాటికి ఆ సంస్థలో సాఫ్ట్ బ్యాంక్ వాటా 18.5 శాతం. ఇందులో సాఫ్ట్ బ్యాంక్ విజన్ (ఎస్వీఎఫ్) ఇండియా 17.3 శాతం, మరో 1.2 శాతం ఎస్వీఎఫ్ ఫాంథర్ (కేమాన్) కలిగి ఉన్నాయి. పేటీఎం ఐపీఓ సమయంలో ఎస్వీఎఫ్ ఫాంథర్ తన వాటా మొత్తం రూ.1689 కోట్లకు విక్రయించింది. దాని విలువ 225 మిలియన్ డాలర్లు. పేటీఎం ఐపీఓకు వెళ్లినప్పుడే.. ‘పేటీఎం ఐపీఓకు వెళ్లిన 24 నెలల తర్వాత ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతాం’ అని సాఫ్ట్ బ్యాంక్ ముందుగానే ప్రకటించింది. తన ప్రణాళికకు అనుగుణంగానే సాఫ్ట్ బ్యాంక్.. పేటీఎం నుంచి వైదొలిగినా నష్టపోవాల్సి వచ్చిందని తెలుస్తోందని ఆ రెండు సంస్థల వర్గాల కథనం. నాడు పేటీఎంలో షేర్‌ను సాఫ్ట్ బ్యాంక్ రూ.800 చొప్పున కొనుగోలు చేసింది.
2021లో ఐపీఓకు వెళ్లినప్పుడు పేటీఎం షేర్ ప్రతిపాదిత ధర రూ.2,150 కాగా, స్టాక్ మార్కెట్లలో రూ.1955 (తొమ్మిది శాతం తక్కువ) లిస్టయింది. ఇటీవల పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో కస్టమర్లతో ఆర్థిక లావాదేవీలు జరుపరాదని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో పేటీఎం షేర్ గత మే తొమ్మిదో తేదీన ఆల్ టైం కనిష్ట స్థాయి రూ.310లకు పతనమైంది. 2023-24 మార్చి త్రైమాసికంలో రూ.550 కోట్ల నికర నష్టాలు వచ్చినట్లు పేటీఎం ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- paytm
- rbi
- Soft Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

