New Car | న్యూఢిల్లీ, ఆగస్టు 19: చిన్న కార్ల ధరలు మరింత తగ్గనున్నాయి. కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండటమే ఇందుకు కారణమని హెచ్ఎస్బీసీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో చిన్నకార్లతోపాటు పలు కార్ల ధరలు 8 శాతం వరకు తగ్గనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాలపై 28 శాతంతోపాటు అదనంగా సెస్‌ను విధిస్తున్నారు.
ఈ జీఎస్టీ తగ్గించడంతో చిన్న కార్ల ధరలు 8 శాతం వరకు తగ్గనుండగా, లగ్జరీ కార్లు 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం 4-5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్నది.