న్యూఢిల్లీ, జూన్ 4: గతేడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఐకానిక్ లగ్జరీ సెడాన్ ఆక్టావియా మోడల్ ధరను మరోసారి పెంచింది స్కోడా. ఈ సెడాన్ ధరను మరో రూ.56 వేలు పెంచింది. జూన్ 2021లో దేశీయ రోడ్లపైకి అడుగుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ధరను పెంచడం ఇది రెండోసారి. దీంతో కారు ధర రూ.26.85 లక్షలకు చేరుకున్నది. 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన 188 హెచ్‌పీల శక్తినివ్వనున్నది. హ్యుందాయ్ ఎలాంత్రా, టయోటా కోరోల్లా, హోండా సివిక్లకు పోటీగా సంస్థ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది.