Skoda Kylaq | జెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) తన సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కైలాక్ (Kylaq) కార్ల డెలివరీ సోమవారం నుంచి ప్రారంభించనున్నది. గతేడాది నవంబర్‌లో భారత్ మార్కెట్లో స్కోడా తన కైలాక్ కారును ఆవిస్కరించింది. దీని ధర రూ.7.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. భారత్‌లో విక్రయిస్తున్న స్కోడా కార్లలో కైలాక్ మూడవది. స్కోడా దేశీయ కార్ల విక్రయాల్లో స్కోడా కుషాక్, స్కోడా స్లావియా మోడల్ కార్లకు దాదాపు30 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలోనే స్కోడా తన కైలాక్ కారును భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్కోడా కుషాక్, స్కోడా స్లావియక్ల్రా ఇప్పటికే దేశంలోని ప్రథమ శ్రేణి నగరాల్లో విస్తరించి ఉన్నాయి. తాజాగా వస్తున్న కైలాక్ కారుతో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు తమ బ్రాండ్ విస్తరించాలని స్కోడా భావిస్తోంది.
స్కోడా స్కైలాక్ రూ.7.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై స్కోడా కైలాక్ ఫ్రిస్టేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రూ.14.40 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కైలాక్ ప్రిస్టేజ్ రూ.13.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలకుతుంది. సిగ్నేచర్ మాన్యువల్ వేరియంట్ రూ.9.59 లక్షలు (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్ + మాన్యువల్ వేరియంట్ రూ. 11.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ.10.59 లక్షలు (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్+ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ.12.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
స్కోడా కైలాక్ కారు బుల్లి ఎస్యూవీ కారు కానున్నది. ఇది మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుండాయ్ వెన్యూ వంటి కార్లతో పోటీ పడుతుంది. స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, బాక్సీ ప్రొఫైల్, షార్ట్ ఓవర్హ్యాంగ్స్తో మోడర్న్ సాలిడ్ డిజైన్‌తో వస్తోంది. బట్టర్ఫ్లై గ్రిల్లె, టాప్ ట్రిమ్స్‌లో 17- అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్ ల్యాంప్స్ ప్రామాణికంగా ఉంటాయి.
స్కోడా కైలాక్ కారు డిజిటల్ క్లస్టర్, 10.1అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉంటాయి. ఎంట్రీ లెవల్ వర్షన్లలో 5-అంగుళాల టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. సిక్స్‌వే ఎలక్ట్రిక్ సీట్స్ విత్ వెంటిలేసన్ ఫర్ ది ఫ్రంట్ రో, వేరియంట్లను బట్టి సింగిల్ అండ్ డ్యుయల్ టోన్ ఆప్షన్లతో క్యాబిన్ ఉంటుంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ + వేరియంట్లలో వేర్వేరు ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ, టాప్ స్పెక్ ప్రిస్టీజ్ ట్రిమ్‌లో లెథరట్టే సీట్లు, అదనంగా వేరియంట్ల ఆధారంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వస్తుంది.
స్కోడా కైలాక్ కారు 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 114 బీహెచ్పీ విద్యుత్, 178 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. హయ్యర్ ఎండ్ వేరియంట్లలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. బేసిక్ క్లాసిక్ వేరియంట్ స్కోడా కైలాక్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే లభిస్తుంది. 25కి పైగా యాక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్లు, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, మల్టీ కొల్లిషన్ బ్రేక్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, యాంటీ లాక్ బ్రేక్స్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి.