న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: వాహన సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ 47 వేల యూనిట్ల వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో టైగన్, వర్చస్, కుషక్యూ మాడళ్లు ఉన్నాయి.
వెనుక సీటు బెల్ట్ తయారీలో లోపం తలెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) వెల్లడించింది వీటిలో మే 24, 2024 నుంచి ఏప్రిల్ 1, 2025 వరకు తయారైన 21,513 యూనిట్ల టైగన్, వర్చస్ మాడళ్లు ఉన్నాయి. అలాగే 25,722 యూనిట్ల కుషక్యూ, స్లావియా, కైలాఖ్ మాడళ్లు ఉన్నాయి.