ముంబై, ఆగస్టు 23: స్కోడా ఆటో ఇండియా..ప్రత్యేక ఎక్సేంజ్ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో ప్రస్తుతం ఉన్న కారును ఎక్సేంజ్ చేసుకొని కొత్త కారును కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
ఇందుకోసం ప్రత్యేక ఎక్సేంజ్ బోనస్‌ను కూడా అందిస్తున్నది. ఈ ఎక్సేంజ్ కార్నివాల్ ముంబైతోపాటు న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణెలలో ఉన్న షోరూంలలో కైలాక్, స్లావియా, కుషక్, కొడిక్యూ వంటి మాడళ్లను ఎక్సేంజ్ చేసుకోవచ్చును.